హ‌ద్దు మీరిన పంతుల‌మ్మ‌పై వేటు..ఫోటో షూట్ పేరుతో వెకిలి చేష్ట‌లు

హ‌ద్దు మీరిన పంతుల‌మ్మ‌పై వేటు..ఫోటో షూట్ పేరుతో వెకిలి చేష్ట‌లు

TEJA NEWS

Bangalore Teacher : హ‌ద్దు మీరిన పంతుల‌మ్మ‌పై వేటు..ఫోటో షూట్ పేరుతో వెకిలి చేష్ట‌లు

బెంగ‌ళూరు – పాఠాలు చెప్పి విద్యార్థుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా ఉండాల్సిన పంతుల‌మ్మ ఆర్. పుష్ప‌ల‌త ప‌క్క దారి ప‌ట్టింది. స్టూడెంట్ తో ముద్దు ముచ్చ‌ట‌కు తెర తీసింది. దీనికి ఫోటో షూట్ అంటూ అంద‌మైన పేరు పెట్టింది. ఈ ఘ‌ట‌న స్ట‌డీ టూర్ పేరుతో క‌ర్ణాట‌క‌లోని చిక్ బ‌ల్లాపూర్ లో చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సోష‌ల్ మీడియాలో స‌ద‌రు టీచ‌ర్, స్టూడెంట్ ప్రేమ క‌లాపం గురించిన ఫోటోలు , వీడియో వైర‌ల్ గా మారింది. టాప్ లో ట్రెండింగ్ లో కొన‌సాగడం విశేషం.

దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో బీఈవో ఉమాదేవి పాఠ‌శాల‌ను సంద‌ర్శించి విచార‌ణ చేప‌ట్టారు. హ‌ద్దులు మీరి వెకిలి చేష్ట‌లు చేసిన స‌ద‌రు పంతుల‌మ్మ‌ను విధుల నుంచి తొలగిస్తూ చేప‌ట్టారు. విచార‌ణ‌లో వాస్త‌వ‌మేన‌ని తేల‌డంతో వేటు వేసిన‌ట్లు బీఈవో వెల్ల‌డించింది.

ఆర్. పుష్ప‌ల‌త ప్ర‌స్తుతం మురుగ‌మ‌ల్ల గ్రామ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో టీచ‌ర్ గా ప‌ని చేస్తంది. ఫోటోల‌లో స్టూడెంట్ టీచ‌ర్ ను కౌగిలించు కోవ‌డం, ముద్దు పెట్టుకోవ‌డం , ఆమెను ఎత్తు కోవ‌డం క‌నిపించింది. వీటిని స్వ‌యంగా సెల్ఫీ తీసుకుని షేర్ చేశారు.

10వ త‌ర‌గ‌తి స్టూడెంట్ తో ఆర్. పుష్ప‌ల‌త రొమాంటిక్ గా ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రోజు రోజుకు విలువ‌లు వ‌దిలి వేస్తున్నారంటూ పేరెంట్స్ వాపోతున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS