TEJA NEWS

ప్రజా సేవ కోసం అనునిత్యం ప్రజల్లో
బిఆర్ఎస్ పార్టీ నాయకులు సడల కర్ణాకర్

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన డప్పు కమలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలియడంతో గ్రామ స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు సడల కరుణాకర్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం కుటుంబానికి 5000 /-ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అనునిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఉండడంతో ఎంతో సంతృప్తి కలుగుతుంది అన్నారు.మనం సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే ఆనందం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాచారం కనకయ్య,మచ్చ రామారావు నర్సయ్య.మచ్చ బాబు పోషమైన క్రాంతి. శివాజీ యూత్ సభ్యులు నాగరాజు బాలకృష్ణ నవిన్ మంద సాయిలు మంద స్వామి గడ్డం అర్జున్, డప్పు సాయి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS