TEJA NEWS

వనపర్తి జిల్లా కేంద్రంలో గల శ్రీ కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2024- 25 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.చంద్రశేఖర్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష మే 17న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటిగా పేరుగాంచిన వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతి సంవత్సరం వివిధ కోర్సుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుతున్నారని ఆయన తెలిపారు, సాంకేతిక విద్య కున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఉద్యోగ పరంగా ఎంతో ప్రాముఖ్యత గాంచిన పాలిటెక్నిక్ సాంకేతిక విద్య నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తుకు మార్గదర్శనం చూపిస్తుందని ప్రిన్సిపాల్ అన్నారు.


వనపర్తి KDR ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గల కోర్సుల వివరాలను ఆయన వెల్లడిస్తూ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయని ఇందులో చేరడానికి పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ అర్హతతో డీఫార్మసీలో కూడా సీట్లు ఉన్నాయని తెలిపారు.
మొత్తం ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు చొప్పున ఖాళీలు ఉన్నాయని వీటి కోసం ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించిందని ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. వంద రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 24 తేదీ వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందని, 300 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 26 వరకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు.


TEJA NEWS