TEJA NEWS

“శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి”.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి, యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందని నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావు తెలిపారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.చిలకలూరిపేట రంగన్నపాలెం కమ్యూనిటీ హాల్లో ఈనెల 21 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


TEJA NEWS