TEJA NEWS

Argument between SCI CIs for commoners

మామూళ్ల కోసం ఎస్సై సిఐ ల మధ్య వాగ్వాదం…!

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల బలవంతపు వసూళ్లు పరాకాష్టకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు తనిఖీలు కూడా వదలకుండా మామూళ్లను వసూలు చేస్తున్నారు. ఇది వ్యవహారంలో ఆదివారం రాత్రి నిజామాబాద్ సిసిఎస్ సీఐ , స్థానిక ఎస్సైతో గొడవపడ్డాడు. బక్రీద్ పండుగ సందర్భంగా వచ్చే మాములు కూడా మాకు రానివ్వరా అని గొడవపడ్డాడు.

నిజామాబాద్ నగరంలోని బాబాసాహెబ్ పహాడ్ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన పశువదశాల ఉంది. అక్కడ బక్రీద్ పండుగ కోసం పశువులను తీసుకొచ్చి వధిస్తారు. దానితో పాటు అటు పెయింటర్ కాలనీ, అమన్ నగర్ ప్రాంతాల్లో పశువుల మందలు కూడా ఏర్పాటు చేసీ రోడ్లపైనే క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి అక్రమ పశువుల రవాణా తనిఖీ కోసం వెళ్లిన సిసిఎస్ సీఐ , బాబన్ సహబ్ పహాడ్ వద్ద పశు వధశాల వద్ద ఉన్న కసబ్ (కటికే ) వారీ వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. సీఐ యూనిఫాంలో లేకపోవడం, స్థానిక అధికారి కాకపోవడం, మద్యం మత్తులో డబ్బులు డిమాండ్ చేయటం స్థానికులు అతనితో వాగ్వాదానికి దిగారు.

ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరింది. అక్కడికి చేరుకున్న స్థానిక ఎస్సైతో సిసిఎస్ సిఐ వాగ్వాదానికి దిగారు. మామూళ్లు మాకు దక్కనివ్వరా అన్ని మీకే కావాలా అని గొడవపడ్డాడు. ఆక్కడి నుంచి వెళ్లిన సీఐ వాహనం రోడ్‌కు అడ్డం పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. దానితో అధికారులు ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టకి తీసుకెళ్ళారు. సిపి ఆదేశాల మేరకు సదరు సి సి ఎస్ సిఐని వాహనంలో స్థానికంగా ఉంటే గొడవ జరుగుతుంది అని హైదరాబాదులోని గాంధీ హాస్పత్రికి తరలించారు సదరు సీఐ ఏప్రిల్ మాసంలో మద్యం మత్తులో రెండవ టౌన్ పరిధి ఏరియాలో రాత్రి వేళ విధులు నిర్వహించి వివాదంలో చిక్కుకున్నాడు ఆనాడు విషయంలో సస్పెండ్ చేసిన అధికార యంత్రాంగం ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చింది పోస్టింగ్ తీసుకున్న సీఐ తీరు మారకపోవడం మద్యం మత్తులోని మామూళ్ల కోసం డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.


TEJA NEWS