TEJA NEWS

హైదరాబాద్‌: సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు చేరుకొని సామగ్రిని తీసుకుంటున్నారు. పోలింగ్‌ సమయాల్లో చేపట్టాల్సిన విధివిధానాల గురించి అధికారులు వారికి సూచనలు చేశారు. సెక్టార్‌ల వారీగా సిబ్బందికి పోలింగ్‌ కేంద్రాల విధులు అప్పగించారు. వీరంతా ఈవీఎంలు, ఇతర సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లనున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమరంలో నాలుగో దశలో దేశవ్యాప్తంగా 96 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. 1,717 మంది అభ్యర్థులు సోమవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 45 మంది అభ్యర్థులు, అత్యల్పంగా ఒడిశాలోని నవరంగ్‌పుర్‌లో నలుగురు బరిలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లోని 42 స్థానాలకూ ఈ దశలోనే పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో 11, ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లలో 8 చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి…..


TEJA NEWS