జగన్మోహన్ రెడ్డిపై దాడి హేయమైన చర్య

జగన్మోహన్ రెడ్డిపై దాడి హేయమైన చర్య

TEJA NEWS

తెలంగాణ మాజీ వైఎస్సార్సిపి రాష్ట్ర కార్యదర్శి వేమిరెడ్డి రోసిరెడ్డి

……

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జన హృదయనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో జరిగిన దాడిని తెలంగాణ మాజీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేమిరెడ్డి రోషిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది హేయమైన చర్య అన్నారు. 2024 ఎన్నికల రణరంగంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి చేతకాకనే ప్రతిపక్ష కూటమి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు దారుణమైన దాడులకు పాల్పడటం పిరికిపందల చర్య అన్నారు. దీనికి ప్రతిపక్ష నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని లక్షల మంది తల్లుల ఆశీర్వాదం ఉన్నది కాబట్టే వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఇటువంటి దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఎవరైనా సరే పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS