ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవం పై అవగాహన సమావేశం
భూపాలపల్లి జిల్లా:
ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ఆహారోత్సవం పేరిట విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కార్యక్రమాలు నిర్వహిం చాలని, విద్యాశాఖ ఆదేశించింది, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రతినెల మూడవ అన్ని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో ఈ కార్యక్ర మాలు నిర్వహించాలని సూచిస్తూ.. అందుకు మార్గదర్శకాలు కూడ విడుదల చేసింది, రాష్ట్ర ప్రభుత్వం…
ఇందులో భాగంగా భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవం పేరిట విద్యార్థుల ఆహార అలవాట్లపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బూర రమేష్, ఆహారం వాటి విలువలపై కార్యక్ర మం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసిన వంటకాలను తోటి విద్యార్థులతో పంచు కునేలా వంటకాలతో పాటు వివిధ రకాల పండ్లను పాఠశాలకు తీసుకురావా లని ఆయన సూచించారు.
విద్యార్థి దశలో పిల్లలకు పోషకాహారం అందించడం ద్వారా వారి ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని, అలాగే పండ్లు కూరగా యల్లో ఉండే పోషకాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు,
అంతేగాక తల్లిదండ్రులు తీసుకువచ్చిన ఆహారము వాటి ప్రత్యేకతలు వాటిని తయారు చేసే విధానం అందులోని పోషక విలువల ను క్షుణంగా వివరించారు. తల్లిదండ్రులు తమ ఇంటి వద్ద సాధ్యమైనంత వరకు పండ్ల, తోపాటు కూరగాయ లు,ఆకుకూరల మొక్కలు నాటాలని, మందులేని కూరగాయలను పిల్లలు తినడం వలన పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని, ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బూర రమేష్, తో పాటు ఉపాధ్యాయులు గిర్నేని గీత, గుబురే లక్ష్మి, ఈశ్వరి, నర్సయ్య, ఫణిందర్, తోపా టు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.