TEJA NEWS

యోగాంధ్ర పై అవగాహన ర్యాలీ

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన యోగాంధ్ర కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన పెంచుతూ తిరుపతిలో సోమవారం ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి రామచంద్ర పుష్కరిణి వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశం అనుసరించే పురాతనమైన యోగా ప్రతి ఒక్కరూ అలవరుచుకుని పాటిస్తే ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నెలరోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 21వ తేదీ ఐదు లక్షల మందితో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ యోగా చేయడం వలన శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకర జీవనం గడపవచ్చునని అన్నారు.

నగరంలోని ప్రతి వార్డులో ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో యోగా పోటీలు కూడా నిర్వహించామని అన్నారు. యోగాలో అందరూ శిక్షణ పొంది ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ఇప్పటి వరకు నగరపాలక సంస్థ పరిధిలో 75 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని, ఈ సంఖ్య లక్షకు పైగా అవుతుందని అన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పోటీల్లో సుమారు 500 మంది పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఏపీ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయకుమార్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహ ఆచారి, అనిత, నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసీపీ బాలాజి, మేనేజర్ హసీమ్, తదితరులు ఉన్నారు.