
భక్తులకు పండ్లు పంపిణీ
తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయం స్వామివారి రథోత్సవం నైనానందకరంగా సాగింది. భక్తుల గోవింద నామస్మరణల మధ్య తిరుమాడ వీధుల్లో రధాన్ని లాగి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం ముందు భక్తులకు తీపిరకం పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది రథోత్సవం రోజున భక్తులకు పండ్లు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ అండ్ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునినాధ రెడ్డి, ఏ వన్ మస్తాన్, మురళి, మునీశ్వర్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
