TEJA NEWS

యోగ ఉంటే ఆరోగ్యం మన వెంట ఉన్నట్టే – ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి


నరసన్నపేట పట్టణం; యోగ మన దిన చర్యలో ఒక భాగంగా చేసుకోగలిగితే మన వెంట ఆరోగ్యం ఉన్నట్టే అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాపట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని వివరించారు. దీనికి కారణం యోగ చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి లభిస్తుందన్న అంశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నెలరోజులపాటు కొనసాగిస్తున్నారని వివరించారు. ఈనెల జూన్ 21న విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమాలను చేపడుతున్నారని ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో తహసిల్దార్ , ఎంపీడీవో ,సి ఐ, ఎస్సై, ఏపీవో, యోగ సభ్యులు, ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.