TEJA NEWS

అయ్యప్ప దర్శనానికి బయలెల్లిన అయ్యప్ప మాలధారులు..
సూర్యాపేట జిల్లా చిలుకూరు
మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేడు అయ్యప్ప మాల ధారణ స్వాములు ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి బయలుదేరారు ఈ సందర్భంగా గురుస్వాములు కాసాని అంజయ్య, బాలేబోయిన గోపయ్య, కైలాసపు శ్రీను, పిల్లుట్ల వెంకన్న స్వాములు మాట్లాడుతూ 41 రోజులుగా మాల ధరించి నియమ నిష్టలతో ఆ స్వామి వారిని సేవించి నేడు కన్నె , కత్తి స్వాములు ఇరుముడి కట్టుకొని అయ్యప్ప దర్శనానికి బయల్దేరుతున్నామని భక్తులకు గ్రామ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు సిరికొండ అనంత కృష్ణమాచార్యులు, సిరికొండ పృథ్వి ఆచార్యులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


TEJA NEWS