బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమసమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా|| బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ…
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో గల రిక్షాపుల్లర్స్ కాలనీలో స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు .
కార్పొరేటర్ మాట్లాడుతూ నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరువలేనిదని అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా తెలిసిపోతుందని దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన అని అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది కాబట్టి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో ఎత్తైన 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి సచివాలయానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కెసిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి కావున ఆ ఉద్దేశం తోటి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా బిఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించడానికి వస్తుంటే రాకుండా హౌస్ అరెస్టులు చేయిస్తున్నాడు దాన్నిబట్టి రేవంత్ రెడ్డి కి అంబేద్కర్ మీద ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర రావు , మరియు ఉద్యమకారులు మాచర్ల భద్రయ్య , మరియు సీనియర్ నాయకులు ఆంజనేయులు, కొండలరావు,బాబు, రమేష్, విద్యాసాగర్, జగన్, ప్రవీణ్, వెంకటేశ్వరరావు, కర్ణాకర్, వెంకన్న, రవీందర్, కె.వి రావు, కిరణ్, కృష్ణ, బాబు, రాములు, మధు, రవి, జై తదితరులు పాల్గొన్నారు. .