
వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ ధర్మకర్త పెండ్యాల ను అభినందించిన బైరెడ్డి, దారపనేని
కనిగిరి నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని భక్తులు ఇలవేల్పుగా భావించి మొక్కులు తీర్చుకుంటుంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులందరికీ నిత్యం దర్శనం చేసుకునేందుకు ఎన్నో వ్యయ ప్రయాసాలతో దేవస్థానాన్ని నిర్మించిన ధర్మకర్త పెండ్యాల సూర్యనారాయణ రావు ను దారపనేని చంద్రశేఖర్, బైరెడ్డి జయరామిరెడ్డి లు అభినందించారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దేవస్థానంలో శుభకార్యాలు జరుపుకునేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారని పెండ్యాల సూర్యనారాయణరావును కొనియాడారు. దేవస్థానం ప్రధాన అర్చకులు బైరెడ్డి, దారపనేని లకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
