
త్యాగానికి, సహనానికి ప్రతీక బక్రీద్ పండగ
ముస్లిం సహోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన…._
శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి ; బక్రీద్ పండగ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముస్లిం సహోదరులందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు_
వనపర్తి పట్టణంలోని శ్రీనివాసపురం లో గల ఈద్గా వద్దకు చేరుకుని అలై బలై ఆలింగనాలు చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు
త్యాగనిరతికి, సహనానికి, ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ ముస్లిం సహోదరుల కుటుంబాలలో శాంతి నెలకొల్పాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు
కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల చందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి మాజీ జడ్పీటీసీ గొల్ల వెంకటయ్య, మాజీ కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
