TEJA NEWS

చిలకలూరిపేటలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు

కళ్యాణి సెంటర్ గడియార స్తంభం సెంటర్ కళామందిర్ సెంటర్ ఈ విధంగా ఆర్టీసీ బస్సులు ఆటోలు విచ్చలవిడిగా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఆపేసి నడిరోడ్డు మీద ప్యాసింజర్స ని ఎక్కించుకుంటూ దించుకుంటూ విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం చేస్తూ వెనుక వచ్చే వాహనాలను ప్రమాదానికి గురిచేస్తూ చిలకలూరిపేట పట్టణ లో ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఉన్న పరిస్థితి పట్టణ ప్రజలు భగవంతుడే మమ్మల్ని కాపాడాలి అని దేవుడి మీద భారం వేస్తూ వారి వారి విధులకు హాజరవుతున్నారు ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు

రోజు రోజుకు జఠిలం గా మారుతున్న ట్రాఫిక్ సమస్య

పట్టణంలో పెరిగిన వాహనాలు…. ఆక్రమణలకు గురైన రోడ్లు… వెరసి ఇబ్బందులు పడుతున్నా ప్రజానీకం

పట్టణంలో ని చీరాల రోడ్ మలుపు వద్ద రెండు భారీ వాహనాలు రోడ్ అడ్డంగా నిలిచిపోయాయి…

ఎదురెదురుగా బస్సు-లారీ రావడం తో మలుపు వద్ద ముందుకెళ్లే పరిస్థితి లేదు….

అప్పటికి పట్టణ పోలీసులు వన్ వే రూట్ పెట్టిన…ఒక్కసారిగా బస్సు-లారీ రావడం తో అటు గా వెళ్లే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పోయే దారి లేక… రోడ్డు పైనే వాహన దారులు, పాదచారులు మండుటెండలో అవస్థలు పడ్డారు.

పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా అర్బన్ పోలీసులు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా… ఈ విధమైన పరిస్థితి ఏర్పడిన సమయంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని పుర ప్రజలు అంటున్నారు

ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలని పుర ప్రజలు ,సీనియర్ సిటీజన్స్ కోరుతున్నారు