
విదేశీ పర్యటనను దిగ్విజయంగా పూర్తిచేసుకొని హైదరాబాద్ నగరానికి చేరుకున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వదేశీ ఆగమన శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
విదేశీ పర్యటనలో భాగంగా యూకె, యూఎస్ఏ దేశాలలో పర్యటించి డల్లాస్ నగరంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నారై విభాగం వారి అధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేల బృందం కేటీఆర్ కి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ చైర్మన్ కె.రవీందర్ రావు తదితరులు ఉన్నారు.
