TEJA NEWS

విద్యారంభాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా ప్రారంభించడంలో ప్లే స్కూల్ లు ఎంతగానో ఉపయోగపడుతాయి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ …

130 – సుభాష్ నగర్ భాగ్యలక్ష్మి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన “అలస్కా ప్లే స్కూల్” ను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పిల్లల విద్యా ప్రారంభంలో ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసింపచేయడంలో ప్లే స్కూల్ లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, భాగ్యలక్ష్మి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సాగర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుంటి మల్లేష్, యాదగిరి, నరేందర్ రెడ్డి, ఆనంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.