TEJA NEWS

రేవంత్ మంత్రివర్గ విస్తరణ – కొత్తగా వీరికే ఛాన్స్, ఇద్దరు ఔట్..!

ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కొంత కాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఢిల్లీలోనూ కసరత్తు జరిగింది.

సామాజిక సమీకరణాల సమతుల్యత పేరుతా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు ఏఐసీసీ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్ల జాబితాకు ఢిల్లీ ఆమోద ముద్ర వేసింది. శాఖల్లోనూ మార్పులు ఖాయమయ్యాయి.

రేపే విస్తరణ

రేపు(ఆదివారం) తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారైంది. ముగ్గురు లేదా నలుగురు వరకు చోటుండే అవకాశం ఉంది. తొలుత అయిదుగురు వరకు ఛాన్స్ ఉంటుందని భావించినా.. ముగ్గురి పేర్లకు ఇప్పటి వరకు ఆమోదం లభించింది. ఆషాఢ మాసము ప్రారంభం అవుతుండటం తో విస్తరణ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ కోరారు. దీనికి ఏఐసీసీ ఆమోదం తెలపటంతో ఆదివారం విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కుల గణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ, అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమా చారం. ఐదు మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

ఛాన్స్ దక్కేదెవరికి

ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. ఇక.. మంత్రివర్గంలో ఒకరిద్దరికి స్థానచలనం తప్పదనే చర్చ వినిపిస్తోంది. మంత్రులు గా తొలిగించిన వారికి పార్టీలో బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురైన మంత్రితో పాటుగా.. మరో మంత్రి పేరు తెర మీదకు వస్తోంది. కాగా, సామాజిక సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న విజయశాంతికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన రేవంత్ సన్నిహిత నేత అద్దంకి దయాకర్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు రేసులో ఉండగా.. ఇప్పుడు దయాకర్ పేరు తెర మీదకు వచ్చింది. దీంతో, ఈ ఇద్దరిలో ఎవరికి చివరికి అవకాశం దక్కుతుందనేది కీలకంగా మారుతోంది.

కాగా, కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం మంత్రివర్గ విస్తరణ ద్వారా కొత్త సమస్యలు రాకుండా చూడాలని పార్టీ నేతలకు స్పష్టం చేసింది. త్వరలో ఆషాడ మాసం ప్రారంభం కానుంది. దీంతో, ముందుగా ముగ్గురితో మంత్రివర్గ విస్తరణ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీని ద్వారా వచ్చే స్పందనలకు అనుగుణంగా మిగిలిన బెర్తులు పూర్త చేయాలనేది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే, పార్టీ నతేలు మాత్రం మంత్రివర్గ విస్తరణ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విస్తరణ పైన ఓపెన్ గా స్పందించేందుకు పార్టీ నేతలు నిరాకరిస్తు న్నారు. ఇక వేళ రేపు విస్తర ణ వాయిదా పడితే ఈ నెల 22వ తేదీలోగా మాత్రం మంత్రివర్గ ప్రక్షాళనతో పాటుగా టీపీసీసీ కార్యవర్గం సైతం అధికారికంగా ఖరారు కానుందని సమాచారం.