
ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కాపురం పట్టణంలోని పెదనాగులవరం రోడ్డులో ఉన్న ఈద్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతిక అని ఈద్గా ఒక పవిత్ర స్థలమని తాను గుడికి వెళ్లినట్టే అల్లాహ్ కు తన కష్టాలు చెప్పుకుంటానని తాను చిన్నప్పుడు నుంచి ముస్లిం సోదరులతోనే కలిసిమెలిసి పెరిగానని గుర్తు చేశారు.
ప్రతి ఎన్నికల్లో ముస్లిం సోదరులు తనకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంటారని సాధ్యమైనంత వరకు వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తుంటానని అన్నారు.
