TEJA NEWS

Ban fake seeds...

అధిక ధరలకు అమ్ముతున్న డీలర్ల పై చర్య తీసుకోవాలి…

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏసంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు

కిసాన్ జిల్లా అధ్యక్షులు ఎనుముల నాగరాజు మాట్లాడుతూ

వడ్డేపల్లి మండల పరిధిలోని ఈరోజు కొంకల గ్రామంలో రైతు అవగాహన సదస్సు జరిగినది.

అయితే ఈ సదసుకు హాజరైన అగ్రికల్చర్ ఆఫీసర్ రాధా మరియు ఏఈఓ విమల గ్రామ రైతులు పాల్గొనడం జరిగినది అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినందువలన యు ఎస్ కంపెనీకి చెందిన 7067 అనే రకం వాస్తవంగా 864 కి మార్కెట్ రేటు కు అమ్మాలి

కానీ 1500 నుంచి 1800 వరకు డీలర్లు అమ్మడం జరుగుతుంది.

ఆ విషయము ఏవో రాధ గారికి కంప్లైంట్ చేయడం జరిగినది వెంటనే శాంతినగర్ లో ఉండే మన గ్రోమోర్ సెంటర్ కు రైతును పంపడం జరిగినది 7067 అనే రకం విత్తనాలు లేవు అని చెప్పడం జరిగినది వెంటనే స్పందించిన ఏవో రాధా ఫోన్ చేస్తే
ఉన్నాయి మేడం 100 కేజీలు అని చెప్పడం జరిగినది.

ఎవరూ అడిగితే వారికి ఎట్లా ఇవ్వాలి కాబట్టి లేవని చెప్పడం జరిగినది
వెంటనే స్పందించిన ఏవో గారు రైతులను తీసుకొని మన గ్రోమోర్ సెంటర్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న స్టాక్ మొత్తాన్ని ప్యాకెట్ 864 మార్కెట్ ఖరీదుకే రైతులకు ఇప్పించడం జరిగినది.

నూజివీడు కంపెనీకి సంబంధించిన ఆధ్యా రకం స్టాకు లేదని చెప్పడం జరుగుతుంది కాబట్టి అధికారులు ఏ ఏ కంపెనీ నుంచి ఏ ఏ షాప్ కి ఎన్ని ప్యాకెట్లు వస్తున్నాయి ఏ రైతులకి ఇస్తున్నారని బిల్లులు చెక్ చేయాలని చెప్పి కోరడమైనది.
మరిముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సిన విషయం రేటు ఎక్కువ చెప్తే మండల అధికారులకు గాని జిల్లా అధికారులకు గాని ఫిర్యాదు చేయాలని విలేకరుల సమావేశంలో కిసాన్ అధ్యక్షులు ఎనుముల నాగరాజు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయంపై వెంటనే స్పందించిన ఏవో రాధ గారికి మరియు జిల్లా అధికారి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, జిల్లా కిసాన్ అధ్యక్షులు ఎనుముల నాగరాజు, కొంకల సర్పంచ్ బతుకన్న, పచ్చర్ల కుమార్, తనగల లక్ష్మీపతి, గొల్ల సుధాకర్, మూలింటి రాముడు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS