కృష్ణవేణి స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సూర్యాపేట జిల్లా : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు టీచర్లు అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఆడిపాడారు. ఈ సందర్భంగా స్కూల్ హెడ్మాస్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని అన్నారు.తెలంగాణ ఆడపడుచులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ అని అన్నారు.నేటి తరం బతుకమ్మ, దసరా పండుగల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి మనదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవో క్రాంతి కుమార్, టీచర్లు సరిత, ఇందు, పుష్పలత,సఫీయా, సమీరా బేగం,సాయి వినిత,శ్రవణ్ కుమార్,సాయి కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
కృష్ణవేణి స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…