TEJA NEWS

భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని
ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నిరసన

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తా వద్ద ఉన్న భారతరత్న రాజ్యాంగం గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అనంతం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేనప్పుడు దళితులను ఎలా రక్షణ ఉంటుందని వారు వాపోయారు రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలను, దళితులను రక్షించడంలో పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు వెంటనే దుండగులను కఠినంగా శిక్షించాలని లేని యెడల పెద్ద ఎత్తున అందోళన చేస్తామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో ఎమ్మెస్సీ జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్,జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ సీనియర్ నాయకులు బాలే శంకర్,దుమల రాజ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు బొనగిరి కిషన్,నక్క రమేష్,జిల్లా ప్రచార కార్యదర్శి కొల్లూరి సురేందర్,పట్టణ అధ్యక్షుడు బొల్లరపు దివాకర్,నాయకులు బాపురపు గంగారాం,సంగేపు ముత్తు,ఎనగంధుల మోహన్,నక్క హరీష్,మల్యాల జీవన్,బాలే నర్సయ్య,నలువల, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS