TEJA NEWS

ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల సమక్షంలో పొంగులేటి శ్రీనన్న పుట్టినరోజు వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల సమక్షంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు. అనంతరం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించారు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులతో కలిసి పాల్గొన్నారు.