TEJA NEWS

డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన…… బిజెపి

వనపర్తి : భారత రాజ్యాంగాన్ని రచించి ఆమోదంలోకి తీసుకువచ్చి నేటికీ 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా అధ్యక్షులు డి నారాయణ పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఓబిసి అధికార ప్రతినిధి బీసీ శ్రీశైలం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 75 వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ దేశంలోని ప్రజలందరికీ కులమత ప్రాంత బేధాలు లేకుండా సమన్యాయం పొందే హక్కును ప్రసాదించి భారత రాజ్యాంగాన్ని ప్రజలంతా ఆమోదించిన రోజు నేడు అని ప్రతి పౌరుడికి హక్కులతో పాటు విధులు బాధ్యతలు కూడా గుర్తెరిగి రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఏ సీతారాములు సుమిత్రమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు కుమారస్వామి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ ఓ బి సి ప్రధాన కార్యదర్శి కాటముని కృష్ణ గౌడ్ పట్టణ అధ్యక్షులు మండల రాజు ప్రధాన కార్యదర్శి రాయన్న సాగర్ నవీన్ చారి సోషల్ మీడియా కన్వీనర్ విజయ్ బొట్టుపల్లి వెంకటయ్య బొలెమోని రాములు శివ సాగర్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS