TEJA NEWS

Blood Donation Mahadanam : Naseer Baba
రక్తదానం మహాదానం : నసీర్ బాబా

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో మాతృ దేవోభవ పితృ దేవో భవ ఫౌండేషన్ ఐదవ వార్షికోత్సవం సందర్భముగా. సందీప్ భాగా ( అసిస్టెంట్ కమిషన్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్) చేతుల మీదగా బ్లడ్ సోల్జర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నసీర్ బాబా కు మహనీయుల పురస్కారాలు బెస్ట్ సర్వీస్ అవార్డు 2024 ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డా” సంపత్ కుమార్, సంపూర్ణేష్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్లడ్ సోల్జర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నసీర్ బాబా మాట్లాడుతూ తమకు ఈ అవార్డు రావడంతో చాలా సంతోషంగా ఉందని ఈ అవార్డు రావడానికి కారకులైన ప్రతి ఒక్క బ్లడ్ డోనర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మా బ్లడ్ సోల్జర్స్ ఫౌండేషన్ కి ఎప్పుడు అండగా ఉండి అత్యవసర సమయంలో రక్తదానాలు చేయాలని ఆశిస్తున్నమన్నారు.


TEJA NEWS