TEJA NEWS

ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి

కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి

‘ఎక్కువ మార్కుల’ను ఎంచుకునే అవకాశం

రాయ్‌పూర్‌ :

విద్యార్థులపై భారం తగ్గించేందుకు వచ్చే సంవత్సరం నుంచి రెండుసార్లు బోర్డు పరీక్షలు (10, 12 తరగతులు) నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు*

ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దానినే ఎంచుకోవచ్చని తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలను ప్రతిపాదించిన సంగతిని గుర్తుచేశారు. ఛత్తీ్‌సగఢ్‌లో పీఎం శ్రీ (ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకాన్ని ప్రధాన్‌ ప్రారంభించి మాట్లాడారు. ఏడాదిలో 10 రోజులు విద్యార్థులు బ్యాగులు లేకుండా బడికి వచ్చేలా చూడాలని ఆ రోజుల్లో కళలు, సంస్క్కతి, క్రీడలు, తదితర కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయాలని కోరారు.

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు బిడ్‌ దాఖలు చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పీఎం శ్రీ పథకం కింద రాష్ట్రంలో 211 పాఠశాలలను ఒక్కోదానికి రూ.2 కోట్లు చొప్పున వెచ్చించి హబ్‌ అండ్‌ స్పోక్‌ పద్ధతిలో అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ‘హబ్‌’గా ఉన్న పాఠశాలను మెంటార్‌గా వ్యవహరిస్తారు.

దీని ద్వారా మిగతావాటికి మార్గ నిర్దేశం చేస్తారు. కాగా, కొత్త ఎన్‌ఈపీని నిరుడు ఆగస్టులో కేంద్రం ప్రకటించింది. రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు సమయం దొరుకుతుందని.. మంచి మార్కులు సాధిచేందుకు వీలు కలుగుతుందని తెలిపింది.


TEJA NEWS