TEJA NEWS

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపు?

న్యూ ఢిల్లీ:
బాంబు పేలుళ్ల బెదిరింపు తో ఢిల్లీలోని రెండు ప్రధాన పాఠశాలల్లో భయాందో ళనలు నెలకొన్నాయి. డీపీఎస్ ఆర్కే పురం, పశ్చిమ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్‌కి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి.

ఈ మేరకు ఉదయం 7 గంటల ప్రాంతం లో ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. స్కూల్ యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుని పిల్లలను వెనక్కి పంపించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాఠశాల ఆవర ణలో తనిఖీలు చేపట్టారు. అయితే, ప్రస్తుతం ఎలాంటి పేలుడు పదార్థాన్ని కనుగొ న్నట్లు ధృవీకరించబడ లేదు. కానీ.. ఇంకా విచారణ కొనసాగుతోంది.

ఇమెయిల్ పంపిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘట న తర్వాత పాఠశాలల్లో నిఘా పెంచారు.కాగా.. దేశ రాజధానిలో నవంబర్ 28న పేలుడు కలకలం సృష్టిం చింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీసింది.

ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. 28న ఉదయం 11:58 గంటలకు పేలుడు గురించి సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపుచేశాయి.


TEJA NEWS