TEJA NEWS

బౌరంపేట్ గ్రామ ప్రధాన రహదారి గ్రామస్థులతో కలిసి రోడ్డు పనులు పరిశీలించిన బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి

కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బౌరంపేట్ మరియు గ్రామం మీదుగా వెళ్లిన ఇతర గ్రామాల ప్రజలు నేటితో ప్రధాన రహదారి సమస్య ఇబ్బందులకు స్వస్తి పలికి రోడ్డు పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి హెచ్ఎండబ్ల్యూఎస్ (మిషన్ భగీరధ) మంచి నీటి పైప్ లైన్లు త్రోవ్వడం వలన రోడ్లు ఛిద్రం అయినాయి ఈయొక్క రోడ్డు నిర్మాణం హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్లు కానీ ఆర్ అండ్ బి వాళ్ళు కానీ వేయాల్సి ఉండే వాళ్ళు పట్టించుకోకపోవడం వలన గ్రామస్థుల అభ్యర్థన మేరకు మన మున్సిపాలిటీ 17 వార్డు జనరల్ ఫండ్ నుండి మీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ముందస్తు ఆలోచన చేసి ఈ యొక్క బిల్లు పెట్టుకోవడం రోడ్డు నిర్మాణం పనులు తాత్సారం వలన ప్రజల ఇబ్బందులు చూడలేక బౌరంపేట్ బీజేపీ నాయకులతో కలిసి రోడ్డు మీద వరి నాటు వేసి నిరసన తెలియజేయడం జరిగింది వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు పనులు ప్రారంభించడం జరిగింది ఈరోజు కమిషనర్ ఏఈ గార్ల సహకారంతో రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసుకోవడం వలన గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది మీ యొక్క రోడ్డు దుస్థితి సమయంలో నిర్మాణ సమయంలో సహకరించిన బౌరంపేట్ గ్రామ ప్రజలు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో గ్రామస్తులు దుగురు సత్యనారాయణ, గడీల సత్యనారాయణ,చింత మల్లేష్,పీసరి శేఖర్ రెడ్డి,శ్రీకాంత్, సంజీవరెడ్డి, నరేష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS