
ఈ సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన బోయపాలెం అమ్మాయి
– గ్రామం గర్వించనంత విజయం దక్కించుకున్న ప్రణతి
ఏపీ ఈ సెట్ ఫలితాల్లో పల్నాడుజిల్లా యడ్లపాడు మండలం∙బోయపాలెం గ్రామం విద్యార్ధిని దొరడ్ల సత్య వెంకటనాగలక్ష్మీ ప్రణతి అపూర్వమైన విజయాన్ని సాధించింది. బ్రాంచ్ స్థాయిలో 237వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 292వ ర్యాంక్ సాధించిన ప్రణతి ఇప్పుడు గ్రామం మొత్తానికి గర్వకారణంగా నిలిచింది. గ్రామానికి చెందిన దోరడ్ల మల్లికార్జునరావు, సౌజన్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, రెండో సంతానమైన∙ప్రణతి పుల్లడిగుంటలోని మల్నేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా కోర్సు పూర్తి చేసింది. ఈ సెట్ ద్వారా ద్వితీయ సంవత్సరం ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించింది. పట్టుదలతో చదువు కొనసాగిస్తూ ఈ స్థాయిలో ర్యాంక్ సాధించిన ప్రణతి కృషికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
