రాత్రి 7 గంటలకు టీవీ9లో బిగ్‌ డిబేట్‌.. పాల్గొననున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

రాత్రి 7 గంటలకు టీవీ9లో బిగ్‌ డిబేట్‌.. పాల్గొననున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

TEJA NEWS

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23: భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రముఖ న్యూస్‌ చానల్‌ టీవీ9 లైవ్‌షో బిగ్‌ డిబేట్‌లో పాల్గొననున్నారు.

సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే బిగ్‌ డిబేట్‌ను టీవీ9 ఎండీ, ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ రజనీకాంత్‌ నిర్వహించనున్నారు. దాదాపు పుష్కర కాలం తరువాత టీవీ9 లైవ్‌ షోలో కేసీఆర్‌ పాల్గొంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24 నుం చి చేపట్టనున్న బస్సు యాత్ర నేపథ్యంలో బిగ్‌ డిబేట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ సంచలన విషయాలను వెల్లడించే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్దికాలం క్రితమే తాను టీవీ లైవ్‌ షోలో పా ల్గొంటానని, అనేక విషయాలను వెల్లడిస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. టీవీ9 షోపై ప్రజ లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS