TEJA NEWS

శేరిలింగంపల్లి డివిజన్ లోగల గిడ్డంగి లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముఖ్య అతిధులుగా హాజరైన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిపారు. ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని కార్పొరేటర్ సమక్షంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్ చే గులాబీ జెండా ను ఎగురవేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ…2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ నేటికీ 23 ఆవిర్భావ దినోత్సవాలు పూర్తి చేసుకుందని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కొరకై ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇటు సంక్షేమంలోనూ అటు అభివృద్ధిలోనూ దేశంలోని కేసీఆర్ హాయంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా అగ్రగామిగా నిలవడం అనేది గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, గోపాల్ యాదవ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మెంబర్ రాంబాబు, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, పిల్లి యాదగిరి, సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రవీందర్, సయ్యద్ నయీమ్, సత్యనారాయణ, మహేష్ చారీ, సయ్యద్ రహీం, ఆశిష్ సింగ్, విజయ్ సింగ్, ముకేశ్ సింగ్, కృష్ణ గౌడ్, నర్సింహా, దస్తగిర్, నటరాజ్, సురేందర్, జార్జ్, మెహన్ రావు, షఫీ మహిళా నాయకురాళ్లు చంద్రకళ, శశికళ, సుజాత, రజిని, కుమారి, రమాదేవి, శశికళ, సుధారాణి, లక్ష్మి, గౌసియా, కళ్యాణి, జయమ్మ, రమా, సుజాత, పద్మ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS