సత్తుపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్
ఖమ్మం జిల్లా:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి హైదరాబాద్ రాజధాని ఏసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణి కులకు బేసిక్ ఫేర్ పై 10% రాయితీ కల్పిస్తున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆదేశాను సారం ఈ నెల 31 వరకు ఈ ప్రత్యేక ఆఫర్ ఉంటుం దని ఆమె తెలిపారు. సత్తుపల్లి నుండి ఎంజీబీ ఎస్ కు గతంలో రూ.690 చార్జీ ఉండగా 10శాతం రాయితీ తో రూ.630 లగా ఉంటుందని అన్నారు.
అదేవిధంగా సత్తుపల్లి నుండి బిహెచ్ఇఎల్ కు గతంలో రూ.730 ఉండగా 10% రాయితీ వలన రూ. 670 ఛార్జ్ ఉంటుందని వివరించారు. సత్తుపల్లి డిపో పరిధిలోని ఏసీ రాజ ధాని బస్సులలో ప్రయాణిం చే ప్రయాణికులు 10 శాతం రాయితీని ఉపయోగించు కొని సుఖవంతమైన ప్రయా ణం చేయవచ్చునని ఆమె తెలిపారు.
ఈ అవకాశం ఈనెల 31 వరకు మాత్రమే ఉంటుం దని, కావున ప్రయాణికులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఆమె కోరారు. మరిన్ని వివరాలకు 9959225990 ను సంప్రదించాలని ఆమె వివరించారు.