TEJA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి,పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం…

సీఎం డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తిన గద్వాల్…

  • నిండు అసెంబ్లీ సభలో మహిళల పట్ల సిఎం,డిప్యూటీ సిఎం,వ్యాఖ్యలు మహిళలకు అత్యంత అవమానకరం…

మాజీ జడ్పీటీసీ,జిల్లా బిఆర్ఎస్ నాయకులు బాసు శ్యామల,హనుమంతు నాయుడు

ఈరోజు తెలంగాణా రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ నందు మాజీ జడ్పీటిసి,జిల్లా బిఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో మహిళా శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారిని,సునీత లక్ష్మారెడ్డి గారిని ఉద్దేశించి నిన్న(బుధవారం) అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఆగౌరవంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందున అట్టి వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించి,ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు….

ఈ సందర్భంగా బాసు శ్యామల,హనుమంతు నాయుడు మాట్లాడుతూ…

సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వెంటనే బిఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణలో ఉన్న మహిళ లోకానికి అంతా కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వారు చేశారు…..

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు,అంగడి బసవరాజు,మోనేష్,తిరుమలేష్ నాయుడు,రాజు నాయుడు,బాసు గోపాల్,టవర్ ముక్బాల్, తప్పెట్ల మోరుసు తిమ్మప్ప,గట్టు మాజీ ఎంపిటిసి S.రాము, బోజ్జయ్య,ముని,హుస్సేన్,గట్టు వెంకటేష్,కంగారు తిమ్మప్ప, ప్రహ్లాద్,అన్వార్,గోపి,లోకేష్,వీరేష్,బలిగెర ఏసన్న,దోర్నాల వీరేష్,పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…


TEJA NEWS