టీజీపీఎస్పీ పదవి బాధ్యతలు స్వీకరించిన బుర్ర వెంకటేశం
హైదరాబాద్:
నిరుద్యోగులు, ఉద్యోగస్తుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అమ ల్లోకి తెస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పారు. ఇవాళ కమిషన్ భవనంలో ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించా రు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ..
ఈ పదవిలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. తాను ఐదున్నరేండ్ల పాటు పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, అందరూ బాగా చదుకొని ధైర్యంగా పరీక్షలు రాయాలని అన్నారు.
ఎవరైనా ఉద్యోగాలు ఇప్పి స్తామని మాయమాటలు చెబితే నమ్మొద్దని, పోలీసు లకు ఫిర్యాదులు చేయాల ని చెప్పారు. పరీక్షల నిర్వ హణను స్పీడప్ చేస్తామని చెప్పారు. తనకు ఐఏఎస్ లో 15 వ ర్యాంకు వచ్చింద ని గుర్తు చేశారు.
తనకు ఇంకా మూడున్న రేండ్లు సర్వీసు ఉన్నా నిరుద్యోగుల కోసం టీజీపీ ఎస్సీ చైర్మన్ గా జాయిన్ అయ్యానని అన్నారు. రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని వివరిం చారు.
తన కలను ఎలా సాకారం చేసుకున్నానో.. నిరుద్యోగు ల కలను అదే విధంగా సాకారం చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు తప్పులు చేసిన వారు ఎవరైనా కమిషన్ ఉంటే స్వచ్ఛందంగా తప్పుకో వాలని సూచించారు.