TEJA NEWS

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం!

హైదరాబాద్:
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ జరగబోతుంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సాయం త్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుంది, ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏతో పాటు, వారి సమస్యలపై చర్చించ నున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం తెలం గాణ ఉద్యోగ సంఘాల నేతలు డీఏపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జీవో నెం.317 అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇక మూసీ బాధితులకు ఇచ్చే పరిహారంపై కూడా మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు సంబం ధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.

బీసీ కుల గణనకొత్త ఆర్వోఆర్ చట్టం పై కూడా ఓ నిర్ణయం తీసుకోబోతు న్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించను న్నారు. జీహెచ్ఎంసీ అధికారాలు ఇటీవలే హైడ్రా కు కట్టబెడుతూ పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చింది.

ఈ నేపథ్యంలో మున్సిపల్ యాక్ట్ చట్ట సవరణ బిల్లు కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ లు, కొత్త రేషన్ కార్డు అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు భరోసా స్కీమ్‌ పై కేబినెట్ చర్చించనుంది.

ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతులకు స్కీమ్ వర్తింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ భేటీలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది.


TEJA NEWS