TEJA NEWS

లోన్స్ తీసుకునే వారికి షాక్.. వడ్డీరేట్లు పెంచిన కెనరా బ్యాంక్

లోన్స్ తీసుకునే వారికి షాక్.. వడ్డీరేట్లు పెంచిన కెనరా బ్యాంక్
దేశంలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ వడ్డీరేట్లను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బెస్డ్‌ లెండింగ్‌ రేటుని 5 బేసిస్‌ పాయింట్లు పెంచినట్లు తెలిపింది. దీంతో ఏడాది కాలపరిమితితో ఎక్కువమంది తీసుకునే పర్సనల్ లోన్స్, వాహన రుణాలపై వడ్డీరేట్లు అధికం కానున్నాయి. వడ్డీరేటు సుమారు 9-9.05 శాతానికి పెరగనుంది. పెరిగిన వడ్డీ రేట్లు ఈనెల 12 నుంచి అమల్లోకి రానున్నాయి.


TEJA NEWS