నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు
ఖమ్మంలో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసు లు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వాహన తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్ లేని 55 బైకులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడిన వాహన పత్రాలు, ఛాయిస్ నంబర్లు తనిఖీ చేస్తూ చోరికి గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలిస్తునట్లు పేర్కొన్నారు.