Category: ANDHRAPRADESH

ANDHRAPRADESH

పత్రికా ప్రకటన.13.01.2024. తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా, తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతిని సంప్రదాయం ప్రకారం అందరూ ఘనంగా జరుపుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఈ మేరకు మైలవరం పట్టణంలోని శాసనసభ్యుని కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు సంక్షేమం కోసం సుమారు…

కృష్ణాజిల్లాగుడివాడ నియోజకవర్గo గుడివాడలో ఈనెల 18న చంద్రబాబు గారి రా.. కదిలిరా .. బహిరంగ సభను జయప్రదం చేయండి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పిలుపు ఈ నెల 18న గుడివాడ లో నిర్వహించనున్న రా.. కదలి రా. .బహిరంగ సభకు ఈ రోజు జిల్లా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూమి పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్…

ఏపీలో వై నాట్ 175 కి గాను 59 సెగ్మెంట్లకు ఇంచార్జ్‌లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం .. అధికారమే లక్ష్యంగా సరికొత్త కార్యాచరణ.. వై నాట్‌ 175 నినాదానికి తగ్గట్టుగా వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీ. గెలుపే లక్ష్యంగా రీజనల్‌ సమావేశాల్లో క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం జగన్‌. ఈ నెల 25న భీమిలిలో తొలి రీజినల్‌ క్యాడర్‌ సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభకు సంబంధించి 59 సెగ్మెంట్లకు ఇంచార్జ్‌లను ప్రకటించింది. గెలుపే లక్ష్యంగా…

జీతాలు జూలై లో పెంచుతాం విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల అమరావతి AP: అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ‘ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మా పరిధిలోకి తెచ్చాం. ఈ సమ్మె వెనుక పొలిటికల్ అజెండా ఉంది. తెగేవరకు లాగకుండా అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మళ్లీ కోరుతున్నాం. జులైలో జీతాలు పెంచుతాం’ అని ఆయన…

ప్రకాశం జిల్లా:- తాటిపర్తి ఆత్మీయ కలయికతో కేడర్లో కనిపించిన జోష్…. ఏ ఒక్కరిని వదలను, ప్రతి వ్యక్తి నీ కలుపుకొని పోతా మనమంతా జగనన్న సైనికులం…తాటిపర్తి సెవెన్ హిల్స్ ప్రాంగణమంతా నాయకులు, కార్యకర్తలతో జనసందోహంగా ఏర్పడిన మార్కాపురం… ఎర్రగొండపాలెం నియోజకవర్గస్థాయి లో వైఎస్ఆర్సిపి నాయకుల ఆత్మీయ కలయిక సమావేశం మార్కాపురం పట్టణంలోని సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్ నందు శనివారం ఎర్రగొండపాలెం సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. సెవెన్ హిల్స్ ప్రాంగణం అంతా ఎర్రగొండపాలెం లోని…

విజయవాడ అంబేద్కర్‌ విగ్రహం..బెజవాడ స్వరాజ్‌ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం నిలవనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా జాతికి అంకితం చేసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నారు. విగ్రహం…

అమరావతి తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్ తెలుగుదేశం లోనే తామంతా కొనసాగుతామని స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు బేగ్ ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ని చేస్తానంటూ ఇటీవల ప్రకటించిన కేశినేని నాని కేశినేని నాని తో తామెవ్వరం వెళ్లట్లేదని లోకేష్ కి స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌ తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకుపైన కలిపి రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్‌మెంట్‌…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణి. 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన స్వామిదాస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు

బెంగళూరులో నివాసం ఉంటున్న నేపాల్ కు చెందిన ప్రియా కుమారి (12) సంవత్సరాల బాలిక తన అత్తతో కలిసి విజయవాడలో ఉంటున్న బంధువులు వద్దకు వెళుతుండగా రైలులో తప్పిపోయి చీరాలలో దిగి స్థానిక చర్చి రోడ్ల లో ఏడుస్తూ తిరుగుతుండగా అదే ప్రాంతంలో గల ఓ ఫర్నిచర్ షాప్ యజమాని బాలికను గుర్తించి ఒకటవ పట్టణ పోలీసులకు అప్పగించారు.ఒకటో పట్టణ సిఐ పి.శేషగిరిరావు బాలిక వద్ద నుండి వివరాలు సేకరించి బంధువులతో ఫోన్లో మాట్లాడి పిలిపించి బాలికను…