Category: NATIONAL

NATIONAL

తమిళనాడు రాష్ట్రంలోని టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే.. బాణ సంచా తయారీ కేంద్రంలో ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. అందులో ఐదుగురు మహిళలలే ఉన్నట్లుగా తెలుస్తోంది. గమనించి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా ఫైరింజన్లు అక్కడి వెళ్లి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, మంటలు అదుపు చేస్తున్నప్పటికీ…

మహారాష్ట్ర – ఖడక్‌వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ధామ్‌లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర సోమవారం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 9న కేదార్‌నాథ్‌ ధామ్‌కు చేరుకుంటుంది

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నిన్న సాయంత్రం నియమితుల య్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిం చారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడా నికి కృషి చేస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంటుం దని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది నాకు చాలా ముఖ్య మైన రోజు, ఎందుకంటే నాకు పెద్ద బాధ్యత అప్పగించారు. నాపై…

ఢిల్లీ మద్యం కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై ఈరోజు తీర్పు వెలువడనుంది. రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వను న్నారు. లిక్కర్ ఈడి సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించా రు. ఈడి, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిసాయి. దీంతో ఇవాళ కవిత బెయిల్‌పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించ నున్నారు. లిక్కర్…

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా జార్ఖండ్ పాలము నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని దేశ రాజకీయ పరిస్థితులపై ప్రసంగించారు. బీజేపీ, జార్ఖండ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ కీలక…

ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. ‘తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలా అడ్డంకి అవుతుంది? వాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటే వాళ్ల హక్కును ఉల్లంఘించినట్లు కాదా? రాహుల్ గాంధీ పేరుతో మరో వ్యక్తి ఉంటే అతడిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా ఆపగలం’ అని ప్రశ్నించింది.

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం.. కేసులు నమోదు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌(ఎస్జీ) తుషార్‌ మెహతా తన వాదనలు వినిపించారు. సీబీఐకి కేంద్రానికి…

సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమ పార్టీ ప్రారంభించిన ‘బీజేపీని తెలుసుకోండి’ కార్యక్రమంలో భాగంగా వారితో చర్చలు జరిపినట్లు నడ్డా తెలిపారు.