విపత్తుల్లో సమర్థ నాయకత్వం చంద్రబాబుది
** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్
చిత్తూరు: తుఫాన్లు, వరదలు వంటి విపత్తులు సంభవించిన సమయాల్లో రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం వహించి ప్రజలకు భరోసా ఇవ్వడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే మేటి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, దేవరాజుల నాయుడు, సురేష్, కుమార్, ధరణి తదితరులతో కలసి వెంకీటీల సురేంద్ర కుమార్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని తీవ్రంగా వణికించిన మొం థ తుఫాన్ మంగళవారం రాత్రి బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద తీరం దాటింది. దాదాపు 18 గంటలపాటు తీవ్ర తుఫానుగా కొనసాగింది,
పెను తుపాన్ తీవ్రతను అంచనా వేయడం , ప్రజలను అప్రమత్తం చేయడం , ప్రాణ నష్టం లేకుండా చేసి ఆస్తుల నష్టం తగ్గించడం , సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టడంలో కూటమి ప్రభుత్వం , అధికారులు , పోలీసులు అన్ని శాఖల సిబ్బంది సమర్ధవంతంగా పనిచేస్తున్నారని వివరించారు. సీఎం విదేశీ పర్యటనలో ఉంటూనే జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల పైన మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని అంచనా వేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తూ, ఆయనే కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు… ఆర్టిజిఎస్ మంత్రి నారా లోకేష్, ఆర్టిజిఎస్ కేంద్రం నుంచి నిరంతరం పరిరక్షించారు. గమనం సహాయ చర్యలను పర్యవేక్షించారు. ప్రధాని ఆఫీస్ ను సమన్వయం చేసుకుంటూ రాత్రంతా సచివాలయంలోనే గడిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1328 గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెలలు నిండిన 3465 మంది గర్భిణీ స్త్రీలను ఆస్పత్రులకు తరలించారు. 1906 తాత్కాలిక శిబిరాలను నిర్వహించారు. 11 ఎన్ డి ఆర్ ఎఫ్,12 ఎస్ టి ఆర్ ఎఫ్, 876 రాపిడ్ రిజర్వ్ బృందాలను సిద్ధం చేయడం జరిగింది.11347 విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫర్లను సిద్ధం చేయడం జరిగింది, 7289 ప్రోక్లైన్లు, క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ముందస్తు చర్యలను తీసుకున్నందుకు ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ఆర్టిజిఎస్ మంత్రి నారా లోకేష్ కు వెంకిటీల కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యుత్ లైన్లు, రోడ్లు రిపేర్లు, పంట నష్టాలను అంచనా వేసి నష్ట నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందని సురేంద్ర కుమార్ తెలియజేశారు. ప్రజలను, రైతులను అన్ని విధాలా ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
