చంద్రబాబు దూరదృష్టి తో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతోమోంథా తూఫాను వల్ల జరిగే నష్ట తీవ్రతనునివారించగలుగారు::తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ .
ఉయ్యూరు లోని జెడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రాన్ని సందర్శించి తుపాను బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ yvb రాజేంద్ర ప్రసాద్ ,
బాధితులకు అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేసిన వ్యాపారవేత్త దండమూడి కిషోర్ ని రాజేంద్ర ప్రసాద్ అభినందించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ గారు గత ఐదు రోజులుగా తుఫాను పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులను ప్రజలను అనుక్షణం అప్రమత్తం చేసి తుఫాను వల్ల జరిగే తీవ్ర నష్టాన్ని నివారించగలిగారని ,ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడగలిగారని అన్నారు,ఇటువంటి విపత్కర పరిస్తితులలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్ర రాష్ట్ర అదృష్టమని అన్నారు,తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని, అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తుందని ,నిత్యవసర సరుకులు కూడా అందిస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జంపన శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా,దండమూడి కిషోర్,సాయి,అప్పలనాయుడు, పిల్ల వాసు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,మరియు,7,8 సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు,.
