చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు మానవత్వం
వరద బాధితులకు మధ్యాహ్న భోజన సదుపాయం
చిలకలూరిపేట: తుఫాను ప్రభావంతో మండలంలోని పసుమర్రు గ్రామంలోని పలు కాలనీలు వరద నీటితో పూర్తిగా మునిగిపోవడంతో, నిరాశ్రయులైన బాధితులను అధికారులు సమీపంలోని హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వసతి కేంద్రానికి తరలించారు.ఈ నేపథ్యంలో, చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు మానవతా దృక్పథంతో స్పందించారు. వసతి కేంద్రానికి చేరుకుని, వరద బాధితులను స్వయంగా పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా, బాధితులకు తక్షణ సహాయం అందించే ఉద్దేశంతో, మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు.ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసు అధికారి చూపిన చొరవ, సహాయానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. సీఐ సుబ్బానాయుడు సేవలను వారు ప్రత్యేకంగా అభినందించారు.
