నిండు ప్రాణాన్ని కాపాడిన చంద్రగిరి పోలీసులు
చంద్రగిరి: తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటూ పోలీస్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో చంద్రగిరి పోలీసులు సఫలీకృతమయ్యారు.
శ్రీనివాసమంగాపురం రైల్వే ట్రాక్ వద్ద, తిరుపతి వాసి ఆటోడ్రైవర్ దుర్గానాయక్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫోన్ చేసి చనిపోతున్నానని తెలియజేశారు.
తక్షణ స్పందన:
డయల్ 100 ద్వారా సమాచారం అందగానే చంద్రగిరి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అప్రమత్తంగా స్పందించారు. సమయ స్ఫూర్తితో ఎస్బి హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం, కానిస్టేబుల్స్ చిరంజీవి, కిరణ్, శ్రీను సమయస్ఫూర్తి, ధైర్యంతో తక్షణ చర్య తీసుకుని దుర్గానాయక్ నిండు ప్రాణాన్ని కాపాడి మానవత్వానికి నిదర్శనమయ్యారు. జిల్లా ఎస్పీ చంద్రగిరి పోలీసులను అభినందించారు. తిరుపతి పోలీస్ శాఖ ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఘటనలో సమయస్ఫూర్తి, అప్రమత్తత, సేవా మనోభావంతో ప్రజలతో కలసి ముందుకు సాగుతోందనేందుకు ఈ ఘటన ప్రధాన నిదర్శనం.
