TEJA NEWS

హెల్మెట్ అవేర్‌నెస్ ర్యాలీ

** ప్రజల భద్రతే ముఖ్యమన్న ట్రాఫిక్ డీఎస్పీ

తిరుపతి: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణచారి పర్యవేక్షణలో మ్యాంగో మార్కెట్ యార్డ్ సమీపంలోని గరుడ వారధి వద్ద ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు… విద్యార్థులు ఒక పువ్వు అందించి, “హెల్మెట్ – ప్రాణ రక్షక కవచం” అనే సందేశంతో అవగాహన కల్పించారు.
అలాగే, గరుడ వారధి పై గరిష్ట వేగ పరిమితి 30 కి.మీ మాత్రమేనని గుర్తుచేసి, వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. “ప్రతి ప్రాణం విలువైనది – చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది” అనే సందేశాన్ని పోలీసులు ప్రజల్లో విస్తృతంగా పంచారు. తిరుపతి జిల్లా పోలీసులు ప్రజల భద్రతను ప్రధాన ధ్యేయంగా చేసుకుని, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ చారిలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు సంజీవ్‌కుమార్, సుబ్బరామిరెడ్డి, ఎస్సైలు బాలాజీ, విజయలక్ష్మి, ట్రాఫిక్ సిబ్బంది, నారాయణ స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.