TEJA NEWS

కుప్పాల”కు… “గుండాల” జన్మదిన శుభాకాంక్షలు

తిరుపతి: బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ కు బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండాల గోపినాథ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు కపిలతీర్థం రోడ్డులోని గిరిధర్ కుమార్ నివాసానికి వెళ్లి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు. గిరిధర్ కుమార్ రైల్వే అధికారి కొడుకుగా, రైల్వే ఉద్యోగిగా నిరంతరం ప్రయాణికుల సమస్యలపైనే పనిచేశారని కొనియాడారు. ఆయన వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని ఆశిస్తూ రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు మహిధర్ రెడ్డి, అనిల్, రాజశేఖర్, బ్రహ్మానందం తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కుప్పాల గిరిధర్ తన ఇద్దరు కుమారులతో కలసి కపిలతీర్థం వద్ద భక్తులకు, పేదలకు అన్నదానం చేశారు.