TEJA NEWS

అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి!

అయోధ్య: అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖులంతా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం శ్రీరామచంద్రుడి ఫోటోలు మొట్టమొదటిసారిగా బయటికి వచ్చాయి. దివ్యమైన రూపంతో భక్తులకు శ్రీరాముడు దర్శనమిచ్చాడు. రాముడిని చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదని భక్తులు ఆనందపడుతున్నారు. అయోధ్యలోని శ్రీరాముడి ఫస్ట్ మీకు అందిస్తోంది.


TEJA NEWS