విశేష అలంకరణలో పిల్లలమర్రి చెన్నకేశవస్వామి
_ 11 కేజీల తులసితో విశేష పూజలు
సాక్షిత సూర్యపేట రూరల్ (పిల్లలమర్రి) : మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి చెన్నకేశవస్వామి ఆలయంలో పురస్కరించుకుని ఆలయ అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు 11 కేజీల తులసితో ప్రత్యేక అలంకరణ చేశారు.కార్తీకమాసం చివరి కావటంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆలయ కమిటీ ఛైర్మన్ గూకంటి రాజబాబు రెడ్డి మాట్లాడుతూ ప్రతి స్వామి వారి విశేష పూజలు అలంకరణలు జరుగుతాయన్నారు.
పురాతన ఆలయాలలో ఒకటిగా సూర్యాపేట జిల్లాలో మొదటి ఉత్తర ముఖ ద్వారం కలిగి లక్ష్మీ సమేతంగా ఇక్కడ చెన్నకేశవస్వామి ఉండటం విశేషమని తెలిపారు.ఆలయంలో జరిగే పర్వదిన కార్యక్రమాలకు భక్తులు ధన వస్తు రూపేణ సహకారం అందించాలని కోరారు. పురతాన దేవాలయం కావటంతో ఆలయ శిఖర గోపురం శిథిలావస్థకు చెరిందని తిరిగి పున నిర్మానానికి కావలసిన వనరులకు భక్తులు దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గోన్నారు.