Spread the love

అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

మార్చి 2 న వనపర్తిలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటన

వనపర్తి
వనపర్తి జిల్లా సహా వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని వారి నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందజేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి.

చిన్నారెడ్డి అందజేసిన వినతి పత్రాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటానని చిన్నారెడ్డికి హామీనిచ్చారు.

మార్చి 2 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వనపర్తిలో పర్యటించనున్నట్లు జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తిలో తనతోపాటు విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులతో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారని, ఆ తరువాత వనపర్తి జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలలో పాల్గొని అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతారని శ్రీ జిల్లెల చిన్నారెడ్డి వివరించారు.