ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు

TEJA NEWS

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట డివిజన్ సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా సుప్రబాత్ నగర్ లో BRS పార్టీ కార్యాలయాన్ని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి BJR నగర్, రేణుక నగర్, బల్కంపేట తదితర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. మంగళహారతులు పట్టి పూలమాలలు, శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. పేద, మధ్య తరగతి ప్రజల పక్షాన నిలిచే BRS పార్టీకే మా మద్దతు అని, కారు గుర్తుకు ఓటేసి పద్మారావు గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, MP అభ్యర్థి పద్మారావు గౌడ్ లు మాట్లాడుతూ ప్రజలకు ఏం చేశామో చెప్పి ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం తమకు ఉందని, BJP, కాంగ్రెస్ పార్టీల నాయకులు చెప్పగలరా ? అని ప్రశ్నించారు. సనత్ నగర్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ నగరంలోని అన్ని నియోజకవర్గాలు BRS ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చెందాయని వివరించారు.

ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించిన ఘనత BRS. ప్రభుత్వానిదేనని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్ కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ పై BRS జెండా ఎగరడం తధ్యమని అన్నారు. ప్రచార కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, BRS పార్టీ అమీర్ పేట, సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు హన్మంతరావు, కొలన్ బాల్ రెడ్డి, నాయకులు అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నర్సింహ, గులాబ్ సింగ్, సుమిత్ సింగ్, బలరాం, ఉత్తమ్ కుమార్, హరిసింగ్, పీయూష్ గుప్తా, వనం శ్రీనివాస్, లలితా గోపిలాల్ చౌహాన్, బాసా లక్ష్మీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,

Print Friendly, PDF & Email

TEJA NEWS